APPSC Group 1 Mains Results Interviews

• మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
• 314 పోస్టులకు 606 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. 1:2 చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన 606 మంది అభ్యర్థుల రిజిస్టర్ నంబర్లను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈనెల 28 నుంచి మార్చి 22 వరకు నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని తెలిపింది. ఏయే తేదీల్లో ఏయే నంబర్ల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్న వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని, అభ్యర్థులకు కూడా వ్యక్తిగతంగా కాల్ లెటర్స్ పంపిస్తామని వెల్లడించింది. 314 పోస్టుల భర్తీ కోసం 2011లో నోటిఫికేషన్ జారీచేసిన ఏపీపీఎస్సీ.. 2012 మే 27న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలు రాసేందుకు 3,03,710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,73,265 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో అర్హత సాధించిన వారిలో 1:50 చొప్పున 16,782 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది.
వారికి సెప్టెంబరు 18 నుంచి 28 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు 10 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా 606 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. ఈ అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో తమ వయసు, అర్హతలు, స్టడీ సర్టిఫికెట్, కమ్యూనిటీ, క్రీమీలేయర్ తదితర ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుందని వెల్లడించింది. డీఎస్పీ, డీఎస్పీ జైల్స్ (మెన్), డివిజనల్ ఫైర్ ఆఫీసర్ (మెన్), అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అభ్యర్థులకు, వికలాంగులకు వైద్య పరీక్షలు అవసరమని వివరించింది. ఈ పోస్టుల ఎంపిక, నియామకాలు అన్నీ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ప్రిలిమ్స్ ఫైనల్ కీపై నియమించిన నిఫుణుల కమిటీ సిఫారసుల మేరకు ఉంటాయని స్పష్టం చేసింది.

Related Posts

APPSC Group 1 Mains Results Interviews
4/ 5
Oleh

Note: only a member of this blog may post a comment.

Trending

DMCA.com
http://aptsmanabadiresults.tumblr.com